రెండు బైకులు ఢీ.. వ్యక్తులకు గాయాలు
GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పలదొడ్డిపేట శివారులో ఆదివారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకులపై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.