అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు: కమిషనర్

అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు: కమిషనర్

కర్నూలు : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలు రీఓపెన్ కానియోద్దని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన పీజీఆర్‌యస్‌కు 9 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.