ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా
JN: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో శిక్షణ, ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే మేళాకు ఆసక్తి గల నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు.