మందమర్రిలో ఘనంగా బీజేపీ శిక్షణ శిబిరం ప్రారంభం
MNCL: మందమర్రి పట్టణంలోని లక్ష్మీ భవాని ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మండల స్థాయి శిక్షణ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త తమ జీవితంలో పంచ పరివర్తనలను సక్రమంగా పాటించి దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకరావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.