ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేయడమే లక్ష్యం: ట్రంప్‌

ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేయడమే లక్ష్యం: ట్రంప్‌

అమెరికాకు ముప్పుగా మారిన ఇరాన్ సైనిక శక్తిని ఓ క్రమ పద్ధతిలో నాశనం చేయడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంలో వ్యూహాత్మ లక్ష్యాలు సాధించడానికి అతి దగ్గర్లో ఉన్నామని తెలిపారు. ఆ దేశ దాడులతోనే ఇంధన ధరలు పెరిగాయన్నారు. హర్మూజ్‌పై ఆధారపడిన వారే దానిని కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. ఇరాన్ వద్ద చాలా తక్కువ మిసైల్ లాంచర్లు మిగిలి ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు.