అందెశ్రీ పై అభిమానాన్ని చాటుకున్న చిత్ర కారుడు
ADB: తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గట్టు రాజు తెలంగాణ పాటల రచయిత అందెశ్రీపై అభిమానం చాటుకున్నారు. సోమవారం అందెశ్రీ మరణించిన విషయాన్ని తెలుసుకున్న యువకుడు ఆయన రాసిన పాటను గుర్తు చేసుకొని ఆయన చిత్రాన్ని గీసి నివాళులర్పించారు. ఆయన మృతి తెలంగాణ రచయిత లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు.