మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరు మండలంలో మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురు ద్విచక్ర వాహనదారులకు బుధవారం గిద్దలూరు కోర్టు రూ.10 వేలు జరిమానా 2 రోజులు జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుపడ్డ వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి భరత్ చంద్ర శిక్ష జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.