'UFS, PGRS అమలుపై దృష్టి పెట్టాలి'
TPT: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS)ను ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు స్పష్టమైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని, తప్పుడు వివరాలు ఇవ్వకూడదని సూచించారు. అలాగే “అక్షర ఆంధ్ర” కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని తెలిపారు.