ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
NLR: విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 53 మంది అభ్యర్థులు హాజరుకాగా, 26 మంది ఎంపికైనట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మధు తెలిపారు. హీరో మోటర్ కార్ప్, డైకిన్ సంస్థ ప్రతినిధులు ఎంపికైన వారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.