దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
MHBD: తొర్రూరు మండలం జమస్తాన్‌పురం గ్రామంలో జరుగుతున్న దుర్గామాత పండుగ ఉత్సవాలకు ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యక్రర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.