'ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలి'
NRPT: మండలంలోని జాజాపూర్ గ్రామంలో రైతు వేదికలో ప్రధానమంత్రి ధన ధ్యాన కృషి యోజన పథకం ప్రారంభోత్సవ వర్చువల్ కార్యక్రమంలో ఆదివారం ఎంపీ డీకే అరుణ పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ నాయకులు ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.