బాధితునికి CMRF చెక్కు అందజేత
NRML: కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్‌కు చెందిన ఉరే రమేష్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కును సర్పంచ్ బొడ్డు స్పందన శుక్రవారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా పనిచేస్తుందన్నారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.