VIDEO: విద్యార్థిని చితకబాదిన టీచర్
VSP: బాలుడిని టీచర్ పాశవికంగా కొట్టిన ఘటన పెందుర్తి మండలం నాయుడుతోటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సేవ సమాజం చిల్డ్రన్స్ హోమ్‌లో చదువుతున్న ఓ బాలుడిని టీచర్ మౌనిక దారుణంగా కొట్టింది. వీపుపై కమిలిన గాయాలు గమనించిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.