VIDEO: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు 'రైతన్న - మీకోసం' కార్యక్రమంలో రైతుల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు.