జమ్మలమడుగులో CMRF చెక్కుల పంపిణీ

KDP: సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి సూచించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని 37 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.36,41,286ల చెక్కులను శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని, పేదల వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.