శ్రీశైలం డ్యామ్‌కు తగ్గిన వరద.. ఒక గేటు మూసివేత

NDL: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో 7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు గురువారం ఉదయం 7.30 గంటలకు ఒక గేటను మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,17,221 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో మరికొన్ని గేట్లు మూసివేసే అవకాశం ఉంది. వరద పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తుతారు.