వినూత్న పరికరాన్ని రూపొందించిన బెజ్జూర్ మండల విద్యార్థి

వినూత్న పరికరాన్ని రూపొందించిన బెజ్జూర్ మండల విద్యార్థి

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఆశ్రిత్ వినూత్న పరికరాన్ని రూపొందించాడు. వన్యప్రాణుల సంచారాన్ని పసిగట్టేలా అల్ట్రాసోనిక్ సెన్సార్, కెమెరాతో పనిచేసే ఈ పరికరం తయారు చేశాడు. సుమారు రూ.7,500 ఖర్చుతో తయారైంది. జంతువుల కదలికలను గుర్తించి సమాచారం అందించే ఈ పరికరం అటవీశాఖకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు ప్రశంసించారు.