అమ్మ ప్రేమను చాటుకున్న ఎస్సై

అమ్మ ప్రేమను చాటుకున్న ఎస్సై

MHBD: డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో నామినేషన్ వేయడానికి హుణ్య తండాకు చెందిన భూక్య మంజుల-రాంబాబు 6 నెలల బాబుతో వచ్చారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన తల్లి.. క్యూలో నిల్చుంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఎక్కువగా రావడంతో.. ఆ తల్లి పడుతున్న ఇబ్బందిని గ్రహించిన ఎస్సై ఉమా చిన్నారిని తీసుకుని కాసేపు లాలించారు.