VIDEO: సోమశిల జలాశయం వద్ద సందర్శకుల సందడి

NLR: సోమశిల జలాశయం వద్ద సందర్శకులు సందడి నెలకొంది. రెండో శనివారం కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. డ్యామ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. జలాశయం పరిసర ప్రాంతాల్లో అందాలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మహిళా పర్యాటకులకు సరైన తాగునీరు, బాత్ రూమ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.