ఎమ్మెల్యే దివ్య సమక్షంలో భారీగా చేరికలు
KKD: తొండంగి మండలం ఎర్రయ్యపేట గ్రామానికి చెందిన 200 కుటుంబాలు శుక్రవారం సాయంత్రం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్య పార్టీ కండువాలు కప్పి, టీడీపీలోకి ఆహ్వానించారు. పార్టీల వివక్ష లేకుండా పారదర్శక పాలనతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే దివ్య పనితీరుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.