నవధాన్యాల అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: మాఘమాస శుక్రవారం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. సుప్రభాత సేవతో అర్చకులు మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.