నేడు పండితాపురం పశువుల సంత వేలం
KMM: కొమ్మినేపల్లి పంచాయతీ పరిధిలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత నిర్వహణకు నేడు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ దారావత్ అనురాధ తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ వేలం వర్తిస్తుందని, పీసా చట్టానికి అనుగుణంగా ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సంత ఆవరణలో జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు.