ఆటో బోల్తా ఆరుగురు మహిళలకు గాయాలు

ఆటో బోల్తా ఆరుగురు మహిళలకు గాయాలు

KMR: దోమకొండ మండల కేంద్రంలో HP పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీవీఎస్ బండి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆటో డ్రైవర్ తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు.