'స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి'

NDL: స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆదాని సెకీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.