ప్రమాద హెచ్చరిక జారీ..అధికారులు అప్రమత్తం

ASR: గోదావరి ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ రంపచోడవరం, చింతూరు, వీఆర్ పురం అధికారులను ఆదేశించారు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.