ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

KMR: నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ గంగాధర్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు రోజువారీగా 200మందికి పైగా హాజరయ్యే విధంగా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. అనంతరం నర్సరీ పరిశీలించి వేసవి కాలనీ దృష్టిలో ఉంచుకొని రెండు, మూడు సార్లు చెట్లకు నీటిని పట్టాలని పేర్కొన్నారు.