కత్తెర గుర్తుకు బొడ్రాయి వద్ద పూజలు
MLG: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసిన అభ్యర్థులకు నేడు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుడ్ల శ్రీలతకు కత్తెర గుర్తును కేటాయించారు. ఈ మేరకు ఈసీ కేటాయించిన గుర్తును స్థానిక బొడ్రాయి వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, కాంగ్రెస్ నేతలు ప్రచారంలోకి వెళ్లారు.