విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

NGKL: కష్టపడి చదివిన విషయాలను ఆసక్తితో రాస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. తెలకపల్లి మండలంలోని గౌరెడ్డి పల్లి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని కోరారు.