నెల్లిమర్లలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెగాడ సమీపంలోని ఓ లేఅవుట్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వృద్ధుడి వయస్సు సుమారు 65-70 ఏళ్లు ఉంటుందన్నారు. ప్రాథమికంగా వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.