రాయచోటిలో వ్యక్తి అరెస్ట్.. 14 వాహనాలు స్వాధీనం

కడప: రాయచోటి టౌన్ గాలివీడు రింగ్ రోడ్ వద్ద బుధవారం బుక్క అశోక్ నాయక్‌ను అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్సై భక్తవత్సలం తెలిపారు. నిందితుడి నుంచి 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ముద్దాయి గతంలో మదనపల్లి, పుంగనూరు, గాలివీడు, ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 21 బైక్‌లను దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. అయినప్పటికి అతనిలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.