మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
NRML: లక్ష్మణచందా (M) చింతలచాంద గ్రామంలో మద్యానికి బానిసైన శైలేందర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు హెడ్ కానిస్టేబుల్ శంకర్ సోమవారం తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా మద్యానికి బానిసైన శైలేందర్, మార్చి 28న మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవపడి పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.