పెద్దమందడి తహసీల్దారుగా ఎన్.సరస్వతి

WNP: పెద్దమందడి మండల తహసీల్దారుగా ఎన్. సరస్వతి గురువారం ఇంఛార్జ్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తూ పదోన్నతిపై వచ్చిన నూతన తహసీల్దార్‌కి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని పేర్కొన్నారు.