ఈ నెల 7న భద్రమ్మ తల్లి వార్షికోత్సవం

శ్రీకాకుళం నగరంలోని బలగ గ్రామ దేవత శ్రీ భద్రమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.