సబ్ సెంటర్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

KNR: తిమ్మాపూర్ మండలం పార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ సెంటర్‌ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. సబ్ సెంటర్ ఆవరణలో ఓ మొక్కను నాటి, పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటడం మన బాధ్యత అని తెలియజేశారు. సబ్ సెంటర్ అధికారులు, సిబ్బందితో ముచ్చటించి, గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.