విద్యుత్ షాక్‌తో యువతి మృతి

విద్యుత్ షాక్‌తో యువతి మృతి

WGL: విద్యుత్ షాక్‌కు గురై యువతి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగాపురం గ్రామానికి చెందిన సృజన (20) బీటెక్ చదువుతోంది. సెలవులు కావడంతో సోమవారం ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.