పలువురి అధికారులకు పదోన్నతులు

ELR: ఏలూరు జడ్పీ కార్యాలయంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న 13 మంది అధికారులకు ఏవోలుగా, డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.