'రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాలి'

MBNR: బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పాలమూరు కృష్ణయ్య తెలిపారు. కోయిలకొండ మండలంలో మండల అధ్యక్షుని నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రకటించి, వారి సంక్షేమానికి కృషి చేయాలి అన్నారు.