‘భారత్ విషయంలో ట్రంప్‌నకు పరిణతి లేదు’

భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయాలను ప్రముఖ US జర్నలిస్ట్ రిక్ సాంచెజ్ తప్పుబట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై అధిక సుంకాలు విధించడం అజ్ఞానమని అన్నారు. ట్రంప్ భారత్‌ను ఓ చిన్న పిల్లాడిలా భావించి, తాను చెప్పినట్లు వింటుందని అనుకుంటున్నారని, కానీ భారత్ పరిణతి చెందిన దేశమని, తన ప్రయోజనాలు తనకు తెలుసని సాంచెజ్ అన్నారు.