ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం ప్రారంభించారు. ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన తగిన మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అన్నారు.