విజయ్ ఎన్డీయేతో జతకడతారు: కేంద్రమంత్రి
తమిళనాడు రాజకీయాలపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమ ఎన్డీయే కూటమిలో చేరుతుందని జోస్యం చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టి పోటీ ఇస్తుందని, హంగ్ ఏర్పడితే విజయ్ మద్దతుతోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫలితాల అనంతరం విజయ్ మద్దతు కోరుతామని అథవాలే తెలిపారు.