హిందూ సమ్మేళనం..ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
RR: షాద్‌నగర్ పట్టణంలో శివమారుతి బస్తి హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శంకరస్వామీజీ మాట్లాడుతూ.. ప్రపంచానికి శాంతి, సహనాన్ని నేర్పిన గొప్ప సంస్కృతి మనదని, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉన్నప్పుడే సమాజం శక్తివంతంగా తయారవుతుందన్నారు.