నిరూపిస్తే ఉరి వేసుకుంటా: మధుసూదనాచారి
TG: BRS నేత మధుసూదనాచారి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానని ప్రకటించారు. రెఫరండం నిర్వహించాలని డిమాండ్ చేసిన ఆయన.. ఇది ఛాలెంజ్ కాదని, బాధతో చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసంపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.