ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో మార్పులు చేయాలి: జెడీ లక్ష్మీ నారాయణ

విశాఖ: చట్టాలు ప్రజలకు మేలు చేసేలా దుర్మార్గులపై ఉక్కు పాదం మోపేలా ఉండాలని జై భారత్ నేషనల్ పార్టీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే సామాన్యులపై దుష్ప్రభావం చూపుతాదన్నారు.