భారీగా పీడీఎస్ బియ్యం సీజ్

భారీగా పీడీఎస్ బియ్యం సీజ్

విశాఖ పోర్టు ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే ముఠా గుట్టును పౌర సరఫరాల శాఖ అధికారులు రట్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు లారీల్లో తరలిస్తున్న 103 టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో అధికారులు సీజ్ చేశారు. నిరుపేదల బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేసేందుకు స్కెచ్ వేయగా, విశాఖలో అధికారులు దాడులు నిర్వహించి లారీలను స్వాధీనం చేసుకున్నారు.