'దీక్షా దివస్' పేరుతో BRS మోసం.. మంత్రి ఫైర్
TG: దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. గతంలో ఒక్కరోజు చేసే దీక్షను.. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే 10 రోజులకు పెంచారని ఎద్దేవా చేశారు. ఇదంతా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.