ఆవు చేనులో మేసిందని కుటుంబంపై దాడి..!

ఆవు చేనులో మేసిందని కుటుంబంపై దాడి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పోన్నేటిపాలెం పంచాయతీ పనసమాకులపల్లిలో గురువారం ఆవు చేనులో మేసిందనే వివాదంతో ఒకే కుటుంబంపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరి, బాలు కలిసి శంకర్, ఆదిలక్ష్మి దంపతులతో పాటు వారి కొడుకులు, బంధువులను దారుణంగా కొట్టినట్లు సమాచారం. గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.