జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా రేవంత్
JGL: జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా వై రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి పాటుపడనున్నట్టు పేర్కొన్నారు. పంచాయతీలలో అధికారులు సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు