'అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు'
AP: తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలను సంపూర్ణ కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.