అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
HYD: రాణిగంజ్‌లో పునర్వ్యవస్థీకరించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేంద్రం పనితీరును సమీక్షించారు. పిల్లలకు స్టేషనరీ కిట్లు పంపిణీ చేసి, సిబ్బందితో మాట్లాడారు. మెరుగైన సౌకర్యాలతో ఈ కేంద్రం పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందని, సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు.