వ్యాన్ ఢీకొని 20 గొర్రెలు మృతి
W.G: పెదతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం పాల వ్యాన్ ఢీ కొనడంతో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గొర్రెలను విక్రయించేందుకు గొర్రెల మందను కాపరి వెంకటేశ్వర రావు తాడేపల్లిగూడెం తీసుకువస్తున్న వాహనాన్ని పెదతాడేపల్లి వద్ద వ్యాన్ ఢీకొట్టింది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.